Navdeep | మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ కేసుతో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురి పేర్లు బయటకొస్తున్నాయని ఆయన తెలిపారు.. మాదాపూర్‌లో ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుల ఫోన్లను సీజ్ చేసినట్లు వివరించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ కేసుతో సంబంధం ఉన్న వారిలో పలువురు పరారయ్యారని తెలిపారు. ఫోన్లు స్విచ్చాఫ్ చేసి మరి ఫ్యామిలీలతో సహా మాయమయ్యారని తెలిపారు. వారిలో గచ్చిబౌలిలో స్నాట్ పబ్ నిర్వహించే సూర్య, జూబ్లీహిల్స్‌లోని టెర్రా కెఫే అండ్ బిస్ట్రో బార్ నిర్వాహకుడు అర్జున్, షాడో సినిమా నిర్మాత రవి ఉప్పులపాటి, కల్హర్ రెడ్డి, ఇంద్రతేజ్, నవదీప్, శ్వేత, కార్తిక్ పరారీలో ఉన్నారని వివరించారు. వాళ్లందరినీ తొందరలోనే పట్టుకుంటామని సీపీ సీవీ అనంద్ వెల్లడించారు.
అయితే సీపీ ఆనంద్ ప్రెస్మీట్లో నవదీప్ అని చెప్పగానే మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌నకు సంబంధం ఉందని పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు వైరల్ కావడంతో హీరో నవదీప్ స్పందించాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించాడు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని ట్విట్టర్ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
That’s not me gentlemen
I’m right here .. pls clarify thanks— Navdeep (@pnavdeep26) September 14, 2023