Love Mouli Review | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని నటుడు నవదీప్ (Navdeep). ఓ వైపు నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూనే.. మరోవైపు లీడ్ హీరోగా తనను తాను నిరూపించే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. గతేడాది న్యూసెన్స్ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆహాలో ప్రీమియర్ అయిన ఈ ప్రాజెక్ట్‌కు మంచి స్పందన వచ్చింది. కాగా నయా అవతార్ నవదీప్ 2.Oగా కనిపించబోతున్న చిత్రం లవ్ మౌళి (Love mouli) . అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి సి స్పేస్ తెరకెక్కించింది.
తారాగణం :
నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు
బ్యానర్: నైరా క్రియోషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్, సి స్పేస్
రచన -దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ : అవనీంద్ర
మ్యూజిక్ డైరెక్టర్ : గోవింద్ వసంత
పాటల రచన : అనంత శ్రీరామ్
కథ : మౌళి (నవదీప్) చిన్నప్పుడే అమ్మానాన్నలు విడిపోతారు.తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోవడంతో మౌళిని తాతయ్యే పెంచి పద్ద చేస్తాడు. మౌళి 14 ఏళ్ళ వయసున్నపుడు తాతయ్య కూడా చనిపోతాడు. ఇక మౌళికి మంచి చెడు నేర్పేవారెవరూ లేకపోవడంతో తనకు ఇష్టమొచ్చినట్టు పెరుగుతాడు. సమాజంతో పనిలేకుండా తన లోకంలో తను ఉంటాడు. అయితే మౌళిలో ఒక టాలెంట్ ఉంటుంది. అతను ఒక గొప్ప పెయింట్ ఆర్టిస్ట్. మేఘాలయలో స్వంత రిసార్ట్ ఉంటూ తనకు తీరిక దొరికినపుడు పెయింట్స్ వేస్తూ ఉంటాడు. మౌళికి ఒక మేనేజర్ కూడా ఉంటుంది. అమె పేరు హారిక. ఆమెనే మౌళి వేసిన పెయింట్స్ అమ్మిపెడుతూ ఉంటుంది. ఇలా కాల గడుస్తూ ఉండగా ఓ రోజు మౌళి అడవుల్లోకి వళ్తాడు. అక్కడ అతనికి ఓ అఘోరా(Rana)కనిపిస్తాడు. అతను ప్రేమ గురించి టాపిక్ తీస్తాడు. అప్పుడు మౌళి ప్రేమ గురించి నెగిటివ్‌గా మాట్లాడతాడు. దీంతో అఘోర ఓ పెయింట్ బ్రష్ ని సృష్టించి మౌళి దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు.
ఇదిలాఉండగా మౌళి వేసిన ఓ పెయింట్ మౌళి మాజీ గర్ల్ ఫ్రెండ్ కొనుక్కుంటుంది. మౌళికి హారికతో(భావన సాగి) గొడవ అవుతుంది. అసలు నీకేం తెలీదు, నీకెలాంటి అమ్మాయి కావాలో కూడా తెలీదు అని తిట్టి వెళ్ళిపోతుంది హారిక. ఆ కోపంలో అఘోరా ఇచ్చిన పెయింట్ బ్రష్‌తో తనకు కావాల్సిన అమ్మాయి లక్షణా ప్రతిబింబించేలా చిత్ర(పంఖురి గిద్వాని) అనే పేరుతో ఓ అమ్మాయి బొమ్మ పెయింట్ వేస్తాడు. ఇక్కడే మౌళి షాకయ్యే సంఘటన జరుగుతుంది. ఆ పెయింట్ లోంచి నిజంగానే చిత్ర బయటకు వస్తుంది. చిత్రతో కూడా గొడవ అయి మళ్ళీ తనకు కావాల్సిన అమ్మాయి లక్షణాలు ఇవి కాదు అని ఇంకో పెయింట్ వేస్తాడు. చిత్ర మళ్ళీ మౌళి కోరుకున్న క్యారెక్టర్ తో పెయింట్ లోంచి వస్తుంది. ఇలా మౌళి ఎన్ని సార్లు పెయింట్ వేసాడు? చిత్ర ఎన్ని క్యారెక్టర్స్ తో బయటకు వచ్చింది? అసలు మౌళి ప్రేమ అంటే ఏమిటీ అని తెలుసుకుంటాడా? మౌళి మాజీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? ఇద్దరి మధ్య గొడవ ఎందుకు? చివరికి మౌళికి గర్ల్ ఫ్రెండ్ దొరికిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
2.Oగా నవదీప్ నయా అవతార్..
తన లైఫ్ లో జరిగిన ప్రేమకథలు, స్వీయ అనుభవాల ఆధారంగా రాసుకున ఈ సినిమా కథలో నవదీప్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని అంటున్నారు సినీ జనాలు. ప్రత్యేకమైన టేకింగ్ స్టైల్‌తో నిజాయితీగా తెరకెక్కించిన మనస్సును హత్తుకునే సినిమా అని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సెలబ్రిటీ ప్రీమియర్ షోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నవదీప్ గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ లుక్‌లో స్టన్నింగ్ పర్ఫార్మెన్స్తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడని ట్రేడ్ సర్కిల్ టాక్. లవ్, రిలేషన్షిప్ నేపథ్యంలో సాగే లవ్‌మౌళి సిల్వర్ స్క్రీన్‌పై థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందించడం ఖాయమని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇక ఆల్ టైమ్ ఎవర్గ్రీన్ మణిరత్నం క్లాసికల్ చిత్రం రోజా తర్వాత మళ్లీ అలాంటి విజువల్ ట్రీట్ అందించిన సినిమా లవ్ మౌళి.. ఇందులో నవదీప్ విశ్వరూపం చూస్తారని చెబుతున్నారు నెటిజన్లు. లవ్ మౌళి ప్రేమించిన వాళ్లు.. ప్రేమించుకుంటున్న వాళ్లు , ప్రేమిచాలనుకే వాళ్లు, ప్రేమలో రొమాన్స్ కోరుకునే వాళ్ళు , ప్రేమలో మునిగిన వాళ్లు ఈ సినిమాను చూసేయచ్చు.. ఈ వీకెండ్ బెస్ట్ రొమాంటిక్ ఫిల్మ్ లవ్ మౌళి అంటున్నారు. మరి నవదీప్ తాజా సినిమా ఎలాంటి వసూళ్లు రాబట్టబోతుందో చూడాలి.
రేటింగ్ : 2.75/5
A Honest & soulful film with Unique take!! It’s a BLOCKBUSTER response from the celebrity premiere show Wednesday night at Hyderabad. ❤️🔥#LoveMouli 𝐁𝐨𝐨𝐤𝐢𝐧𝐠𝐬 𝐎𝐩𝐞𝐧𝐞𝐝, Book your tickets now!
Grand Release at theatres near you TODAY! 🤩… pic.twitter.com/NZ9PoWnfDl
— Ramesh Bala (@rameshlaus) June 7, 2024
She is Real Lyrical video..