Jagapathi Babu | హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్నాడు టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు. అయితే ఈ టాలెంటెడ్ యాక్టర్‌ను చాలా మంది జగ్గూభాయ్ అని పిలుస్తుంటారని విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్‌తో అందరినీ పలుకరిస్తుంటాడు జగ్గూభాయ్. ఇదిలా ఉంటే.. జగపతిబాబు తాజాగా తన అభిమానులపై ఓ పోస్టు పెట్టి వార్తల్లో నిలిచాడు.
తన అభిమానుల ప్రవర్తనతో అసహనానికి గురైన జగపతిబాబు (Jagapathi Babu) ట్విట్టర్లో ఒక ఎమోషనల్ నోట్ పెట్టాడు.
అందరికి నమస్కారం. 33 ఏళ్ల నా సినీ కెరీర్లో అభిమానులు నా ఎదుగుదలకు ముఖ్య కారణం అని భావించా. వారి యొక్క ప్రతి కుటుంబ విషయాలలో పాల్గొని వారి కష్టాలను నా కష్టాలుగా భావించి నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్క అభిమానులకు నీడగా ఉన్నాను. అభిమానులు అంటే అభిమానం.. ప్రేమ ఇచ్చే వాళ్ళని మనస్ఫూర్తిగా నమ్మాను.. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే కొంతమంది అభిమానులు ప్రేమతో తనని ఇబ్బంది పెట్టి పరిస్థితికి తీసుకువచ్చారని జగపతి బాబు తెలిపారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఇక నుంచి అభిమాన సంఘాలు ట్రస్టుతో నాకు సంబంధం లేదు.. వాటి నుంచి విరమించుకుంటున్నాను అంటూ తెలిపారు. కేవలం ప్రేమించే అభిమానులు నేను ఎప్పుడూ తోడుగా ఉంటానని జగపతిబాబు ట్విట్టర్లో రాసుకోచ్చారు. మరోవైపు నెటిజన్లు జగపతి బాబుకు అండగా నిలుస్తున్నారు.
నా అభిమానులకు మనవి…. pic.twitter.com/iLN9tToL7T
— Jaggu Bhai (@IamJagguBhai) October 7, 2023