Adivi Sesh | ఓ యువతితో డేటింగ్లో ఉన్నాడట.. పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘గూఢచారి’.. అమ్మాయి ఎవరు?
ఓ యువతితో డేటింగ్లో ఉన్నాడట | ఈ సినిమాలన్నీ రొటీన్‌కు భిన్నమైన సినిమాలే. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుడిని కట్టిపడేయడంలో అడవి శేష్ నేర్పరి. అందుకే.. ఇప్పుడు టాలీవుడ్లో దర్శకులకు మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు.
Adivi Sesh | తెలుగులో నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా.. అడవి శేష్ నటనలో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. ఆయన నటించే సినిమాలు కూడా రొటీన్‌కు భిన్నంగా ఉంటాయి. ఒక క్షణం, ఒక ఎవరు, ఒక గూఢచారి, ఇప్పుడు మేజర్. ఈ సినిమాలన్నీ రొటీన్‌కు భిన్నమైన సినిమాలే. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుడిని కట్టిపడేయడంలో అడవి శేష్ నేర్పరి. అందుకే.. ఇప్పుడు టాలీవుడ్లో దర్శకులకు మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు.

వీటితో పాటు పలు పెద్ద సినిమాల్లో మంచి క్యారెక్టర్లు పోషించాడు అడవి శేష్. అయితే.. టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లలో అడవి శేష్ ఒకరు. ఆయన ఎప్పుడు ఒక ఇంటి వాడు అవుతాడా అని సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడవి శేష్ తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. తన పెళ్లి గురించి తనకంటే ఎక్కువగా తన ఫ్యామిలీ మెంబర్స్ తొందరపడుతున్నారని.. ఎలాగైనా పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ కావాలని తనను ఒత్తిడి చేస్తున్నారన్నాడు.
అప్పటి వరకు తను తన పెళ్లి గురించి అంతగా సీరియస్‌గా ఆలోచించలేదట. కానీ.. ఇప్పుడు ఆలోచించాల్సి వస్తోందని చెప్పుకొచ్చాడు శేష్. అంతే కాదు.. తను ప్రస్తుతం ఓ యువతితో డేటింగ్లో ఉన్నాడట. ఆ అమ్మాయిది హైదరాబాదేనట. తను ఎవరో? ఏం చేస్తుందో? అనే విషయాలు సమయం వచ్చినప్పుడు చెబుతా.. అని ఆ విషయాన్ని సస్పెన్స్‌గా పెట్టాడు శేష్.
ఇక.. తన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అడవి శేష్.. మేజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆర్మీ మేజర్ రోల్‌ను పోషిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 11న రిలీజ్ కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Hema Malini: రోడ్లను తన బుగ్గలతో పోల్చడాన్ని తప్పుపట్టిన హేమమాలిని
Hamsa Nandini: నటి హంసానందినికి బ్రెస్ట్ క్యాన్సర్.. కోలుకుని తిరిగొస్తానంటూ ధీమా
పనామా పేపర్ లీక్ కేసు.. ఐశ్వర్యారాయ్‌కి ఈడీ నోటీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

