Aditya Om | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ ఆదిత్య ఓం. నటుడిగా, నిర్మాతగా కొనసాగుతూనే మరోవైపు డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. ఆదిత్య ఓం ఈ సారి డైరెక్టర్‌గా మరాఠీ సాధువు కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 17వ శతాబ్ధపు మరాఠీ సాధువు-కవి భక్తిని ప్రతిఘటనగా మార్చిన సంత్ తుకాకాం జీవిత కథ ఆధారంగా వస్తోన్న చిత్రం సంత్ తుకారం.
పాపులర్ మరాఠీ యాక్టర్ సుబోధ్ భావో టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ మూవీ జులై 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో శివ సూర్యవంశీ, షీనా చౌహాన్, ట్వింకిల్ కపూర్, రూపాలి జాదవ్, అరుణ్ గోవిల్, సంజయ్ మిశ్రా, ముఖేశ్ భట్‌తోపాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక పాపులర్ యాక్టర్ ముఖేశ్ ఖన్నా ఇచ్చిన వాయిస్ ఓవర్ ఈ మూవీకి హైలెట్ కానుందట. ఆదిత్య ఓం మొత్తానికి ఈ సారి హిందీ మార్కెట్‌పై కూడా పోకస్ పెట్టి తనదైన ప్రమోషన్స్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఆదిత్య ఓం కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కర్జన్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పురుషోత్తమన్ స్టూడియోతో కలిసి బీ గౌతమ్ నిర్మిస్తున్నారు.
#SantTukaram hits theatres on July 18th
An epic tale of faith, wisdom, and spiritual revolution, a story that resonates with every Indian
Written & directed by #AdityaOm , produced by #BGautam#SantTukaramOnJuly18@subodhbhave09 @adityaaom @sheenachohan @arungovil12… pic.twitter.com/QBpAjq9LaD
— BA Raju’s Team (@baraju_SuperHit) July 14, 2025
आपल्या मराठी भाषेबद्दल आपले मराठी कलाकार सुद्धा आता बोलू लागले आहेत. अभिनेते सुबोध भावे ह्यांनी अतिशय मार्मिक पद्धतीने आपले विचार मांडलेत.
धन्यवाद @subodhbhave09 @adityaaomतुमचा येणारा #SantTukaram चित्रपट नक्की पाहणार. #Marathi pic.twitter.com/Xh6i4jePoZ
— RajTfanclub (@rajbhakt16) July 13, 2025