విలక్షణ నటుడు సాయికుమార్ యాభైఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా బహుముఖప్రజ్ఞతో ఆయన దక్షిణాది ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. నేడు సాయికుమార్ జన్మదినం.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నటుడిగా యాభైఏళ్ల ప్రయాణం పూర్తిచేసుకోవడం ఆనందంగా ఉందని, ఇప్పటికీ తీరిక లేని షూటింగ్స్‌తో బిజీగా ఉన్నానని అన్నారు. 1975లో ‘దేవుడి చేసిన పెళ్లి’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు సాయికుమార్. ఈ ఏడాది ఆయన నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘కోర్ట్’ చిత్రాలు మంచి విజయాల్ని సాధించాయి.
ప్రస్తుతం తాను తెలుగుతో పాటు కన్నడ, తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నానని సాయికుమార్ తెలిపారు. తెలుగులో సాయిధరమ్‌తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, నాగశౌర్య ‘బ్యాడ్‌బాయ్ కార్తీక్’, కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’, అల్లరి నరేష్ ‘12ఏ రైల్వే కాలనీ, ధర్మస్థల నియోజకవర్గం, రాజాధి రాజా వంటి చిత్రాలతో పాటు మయసభ, కన్యాశుల్కం వెబ్‌సిరీస్‌లలో కూడా నటిస్తున్నానని సాయికుమార్ పేర్కొన్నారు.