TOBY Movie OTT | కన్నడ సినిమా ‘గరుడ గమన వృషభ వాహన’ (Garuda Gamana Vrushaba Vahana) ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు దర్శకుడు ‘రాజ్ బి శెట్టి’ (Raj B Shetty). ఆయన నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఐఎండీబీలో కన్నడ సినిమా ఆల్ టైం లిస్ట్‌లో టాప్‌లో ఉంది. అయితే ఇతడు దర్శకుడిగానే కాకుండా నటుడిగా, స్టంట్ మాస్టర్‌గా, స్టోరి రైటర్‌గా సుపరిచితం. గత ఏడాది వచ్చిన రిషబ్ శెట్టి ‘కాంతారా’ (Kantara) మూవీకి కూడా రాజ్ బి శెట్టి స్టంట్ మాస్టర్‌గా వ్యవహరించాడు.
ఇదిలావుంటే.. చాలా రోజుల తర్వాత రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘టోబి'(TOBY Movie). బాసిల్ అల్చలక్కల్ (Basil Al Chalakkal) దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 25న విడుదలైన ఈ చిత్రం మంచి కన్నడ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా విడుదలైన దాదాపు ఐదు నెలల తరువాత ‘టోబి’ ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం సోనీలివ్ వేదికగా ఈ చిత్రం డిసెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఒక స్పెషల్ వీడియో పంచుకుంది. సంయుక్త హర్నాడ్, చైత్ర ఆచార్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా.. లైటర్ బుద్ధ ఫిలిమ్స్, అగస్త్య ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించింది.
Waiting to Rewatch TOBY?? The wait is over now!
The most awaited OTT release of TOBY is here💥 Releasing @sonylivindia on 22nd December ♥️#TobyOnOtt @RajbShettyOMK #BasilAlChalakkal @Chaithra_Achar_ @samyuktahornad #PraveenShriyan @m3dhun @AgasthyaFilms @SmoothSailors1 pic.twitter.com/R2s4NPolaI
— Raj B Shetty (@RajbShettyOMK) December 18, 2023