ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘ది లెజెండ్’. ఊర్వశీ రౌటేలా నాయికగా నటిస్తున్నది. లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో జెడి, జెర్రీ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28న హిందీతో పాటు దక్షిణాది భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది.
తెలుగులో ఈ సినిమాను శ్రీ లక్ష్మీ మూవీస్ పతాకంపై ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు శరవణన్ మాట్లాడుతూ…‘యాక్షన్, ఎమోషన్ వంటి అన్ని కమర్షియల్ అంశాలున్న చిత్రమిది. మెడికల్ మాఫియా నేపథ్యంతో సాగుతుంది. ఇందులో నేను మైక్రోబయాలజీ శాస్త్రవేత్త పాత్రలో నటించాను. ఒక సామాన్య యువకుడు తన కష్టం, బలం, సామర్థ్యంతో అడ్డంకులను ఎదిరించి లెజెండ్‌గా ఎలా ఎదిగాడు అనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం’ అన్నారు.