Tiragabadara Saami | రాజ్‌తరుణ్.. ఇప్పుడు ఈ పేరు వివాదంలో నిత్యం నానుతూనే వుంది. లావణ్య, రాజ్‌తరుణ్‌ల ఏపిసోడ్ పుణ్యమా అని రాజ్‌తరుణ్ సినిమాలకు కూడా ఫ్రీ పబ్లిసిటి వచ్చింది. అయితే ఈ పబ్లిసిటి టిక్కెట్ కౌంటర్ వరకు అయితే వెళ్లలేదు.. సుమీ.. మన ప్రేక్షకులు చాలా తెలివిగలవారు. వాళ్లు చూడబోయే సినిమాలు ముందే ఫిక్స్ చేసుకుంటున్నారు.
అయితే విషయంలోకి వెళితే.. రాజ్‌తరుణ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం తిరగబడర సామీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే థియేటర్లో నేడు విడుదలైన ఈ సినిమాకు వస్తున్న స్పందన చాలా నెగెటివ్‌గా వుంది. రాజ్‌తరుణ్ టైమ్ కూడా బాలేదు.. అందుకే కాబోలు ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు తప్పదు కాబట్టి ఫస్ట్‌హాఫ్ వరకు వెయిట్ చేసి ఇక ఓపిక నశించి.. ఇంటర్వెల్లో తిరగబడుతూ..తిరుగు ప్రయాణంతో.. ఎక్కడా ఆగకుండా ఇంటికి చేరుకుంటున్నారని టాక్. అవుట్ డేటెడ్ స్కీన్‌ప్లేతో తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు పెద్ద పరీక్షే. సినిమాలో సన్నివేశాల్లో ఎలాంటి లాజిక్ కనిపించదు.
ఫస్టాఫ్, సెకండాఫ్ రెండు హాఫ్ల్లో ఎది బాగుందని చెప్పాలంటే ప్రేక్షకులకు అది ఎప్పటికి ప్రశ్నార్థకమే..? కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఇలా…ఎలా ఆలోంచించారు మీరు అని చిత్రబృందంపై సందేహం రాక మానదు. ఇక ఈ చిత్రంలో క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. రాజ్‌తరుణ్ పాత్ర ఔచిత్యం సరిగ్గా కుదరలేదు. అందుకే అతనిపై క్లైమాక్స్ సీన్ ఓవర్‌గా అనిపించింది. మాల్వి మల్హోత్రా అందంగా కనిపించింది. ఓవరాల్‌గా తిరగబడరా సామీ థియేటర్స్‌కు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. రాజ్ తరుణ్ కెరీర్లో ఇది ఫ్లాప్ జాబితాలో చేరిపోవడానికి అన్ని అర్హతలున్న సినిమాగా పరిగణించవచ్చు..!