రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మల్కాపురం శివకుమార్ నిర్మాత. మాల్వీ మల్హోత్రా కథానాయిక. మాస్, యాక్షన్ అంశాలతో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి తనదైన శైలి మాస్ అంశాలతో రాజ్‌తరుణ్‌ను కొత్త పంథాలో ప్రజెంట్ చేశాడని, ఫ్యామిలీ సెంటిమెంట్ కలబోసిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని చిత్ర బృందం పేర్కొంది. మన్నారా చోప్రా ఈ సినిమాలో ప్రత్యేక గీతాన్ని చేస్తున్నది. మకరంద్ దేశ్‌పాండే, రఘుబాబు, జాన్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేబీ, భోలేషావలి, రచన-దర్శకత్వం: ఏఎస్ రవికుమార్ చౌదరి.