గత ఏడాది ‘కె’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన తాజా చిత్రం ‘కె-ర్యాంప్’. జైన్స్ నాని దర్శకుడు. రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మాతలు. యుక్తి తరేజా కథానాయికగా నటిస్తున్నది. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ఈ సినిమా నుంచి ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ పేరుతో గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో మాస్ ఆటిట్యూడ్ ఉన్న కుమార్ అనే యువకుడిగా కనిపించారు కిరణ్ అబ్బవరం.
‘మనం మలయాళ ప్రేమకథలు హిట్చేస్తాం. కానీ తెలుగు ప్రేమకథలతోనే ప్రాబ్లం. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉండే అథెంటిసిటీ మన సినిమాల్లో ఉండదు. ప్రేమ మాత్రం బాగుండాలని కోరుకుంటాం’ అంటూ కిరణ్ అబ్బవరం చెప్పిన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ రెడ్డి మాసం, సంగీతం: చేతన్ భరద్వాజ్, రచన-దర్శకత్వం: జైన్స్ నాని.