టైగర్ ష్రాఫ్, కరణ్ జోహార్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ‘స్క్రూ డీలా’ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. వీరు గతంలో ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ చిత్రానికి పనిచేశారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ‘స్క్రూ డీలా’ చిత్రాన్ని రూపొందించాలని అనుకున్నారు. అయితే ఈ సినిమా కోసం టైగర్ ష్రాఫ్ అడిగిన పారితోషికం విషయంలో కరణ్‌తో విభేదాలు వచ్చాయని తెలిసింది.
టైగర్ ష్రాఫ్ 30 కోట్ల రూపాయలు అడగటంతో కరణ్‌జోహార్ అవాక్కయ్యారట. పాండమిక్ తర్వాత నిర్మాతల పరిస్థితులు బాగాలేవని, ఫీజు తగ్గించుకోమని సూచించగా..టైగర్ నుంచి స్పందన రాకపోవడంతో ఈ సినిమానే క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై చిత్రబృందం స్పందిస్తూ…‘టైగర్ టీమ్‌తో రెమ్యునరేషన్ గురించి మాట్లాడితే 30 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఇంత మొత్తం ఇచ్చేందుకు కరణ్ అంగీకరించలేదు. సయోధ్య కుదరక పోవడంతో సినిమాను రద్దు చేసుకున్నారు’ అన్నారు