1970వ దశకంలో చాలామందికి నిద్ర లేకుండా చేసిన పేరు ‘టైగర్ నాగేశ్వరరావు’. ఓ సాధారణ దొంగ గురించి కేంద్రప్రభుత్వం ఆలోచించిందంటే ‘టైగర్ నాగేశ్వరరావు’ స్థాయిని అర్థంచేసుకోవచ్చు. అతని బయోపిక్‌తో ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిసున్నాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. అక్టోబర్ 20న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ని దర్శక, నిర్మాతలు ప్రారంభించారు.
ఇందులో భాగంగా శుక్రవారం అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేశారు. కథానాయిక నూపుర్ సనన్ పుస్తకాలు పట్టుకుని కాలేజీ అమ్మాయిగా కనిపిస్తుంటే రవితేజ ఆమెను అటపట్టిస్తున్నట్టున్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. మ్యూజికల్ ప్రమోషన్లో భాగంగా ఈ నెల 5న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్టు నిర్మాత అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: మది, సంగీతం :జీవి ప్రకాశ్, మాటలు: శ్రీకాంత్ విస్సా, సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్.