Tiger Nageswara Rao | చరిత్రలో తొలిసారి.. 65 స్క్రీన్స్ లో విడుదల కానున్న ‘టైగర్ నాగేశ్వర రావు’ సైన్ లాంగ్వేజ్ వెర్షన్
Tiger Nageswara Rao | టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). 1970లో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
Tiger Nageswara Rao | టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). 1970లో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుండగా.. రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది.
ఈ మూవీ నుంచి బధిరుల కోసం సైన్ లాంగ్వేజ్ (సంకేత భాషలో) టైగర్ నాగేశ్వర రావు స్పెషల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బధిరుల కోసం ఈ మూవీని ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో 65 స్క్రీన్స్‌లో విడుదల చేస్తునట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఇలాంటి ఫీట్ చేసిన తొలి తెలుగు సినిమాగా అత్యంత అరుదైన రికార్డును టైగర్ నాగేశ్వర రావు ఖాతాలో వేసుకుంది. ఇక టైగర్ నాగేశ్వర రావు ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో కూడా అక్టోబర్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
RAVI TEJA:: ‘TIGER NAGESWARA RAO’ TO *ALSO* RELEASE IN SIGN LANGUAGE ACROSS 65+ SCREENS IN INDIA, OVERSEAS… Arrives in *cinemas* on 20 Oct 2023 [#Dussehra2023]… OFFICIAL POSTER…#TigerNageswaraRao #RaviTeja #Vamsee #AbhishekAgarwal pic.twitter.com/eaUukHXWtI
— taran adarsh (@taran_adarsh) October 14, 2023
ఈ సినిమాలో కృతి సనన్ చెల్లి నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తోండగా.. నుపుర్సనన్కు ఇది టాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ కావడం విశేషం. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా.. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో టైగర్ నాగేశ్వర రావు విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

