Tiger Nageswara Rao | ఇటీవలే రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ (Ravi Teja). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. కాగా రవితేజ పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ స్టోరీతో టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ ఈ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది. కాగా చాలా రోజుల తర్వాత స్టన్నింగ్ ఫస్ట్ లుక్ అప్డేట్ అందించారు.
టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ డేట్‌ను సాయంత్రం 6:03 గంటలకు ప్రకటించనున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు.రవితేజ రైల్వే ట్రాక్‌పై టైగర్ నాగేశ్వర్ రావు గెటప్‌లో చేతిలో కొరడా పట్టుకున్న లుక్ స్టన్నింగ్‌గా ఉంది. వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్న టైగర్ నాగేశ్వర రావులో రేణూదేశాయ్ హేమలత లవణం పాత్ర పోషిస్తోంది. 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో ఈ చిత్రం వస్తోంది.
ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
రైల్వే ట్రాక్‌పై టైగర్ నాగేశ్వర్ రావు..
Ready to strike 🐅#TigerNageswaraRao first look announcement today at 6.03 PM.@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl #RenuDesai @AnupamPKher @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla @SrikanthVissa @MayankOfficl pic.twitter.com/HDmE3GkYM5
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) May 15, 2023