సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘టైగర్-3’. సక్సెస్ఫుల్ ఫ్రాంఛైజీ టైగర్, టైగర్ జిందాహై సిరీస్‌లో మూడో సినిమాగా ‘టైగర్-3’ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దీపావళి పర్వదినం రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 16న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా రా అండ్ రియలిస్టిక్‌గా ఉంటుంది. టైగర్ ఫ్రాంచైజీలో హీరోలను లార్జర్ దేన్ లైఫ్‌లో చూపిస్తారు. కానీ ఇందులో రియల్ హీరోయిజం ఉంటుంది. ఆయుధం లేకుండానే శత్రువుల అంతం చూసే కథానాయకుడు కనిపిస్తాడు. స్వతహాగా టైగర్ తన వేటను పూర్తి చేసే వరకు నిష్క్రమించదు. ఈ సినిమాలో కూడా నా పాత్ర అదే విధంగా ఉంటుంది’ అన్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ‘టైగర్-3’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.