Tiger-3 Movie | ఎప్పుడెప్పుడు టైగర్-3 ట్రైలర్ రిలీజ్ అవుతుందా అని సల్మాన్ తెగ వేయిట్ చేస్తున్నారు. రెండు వారాల కిందట రిలీజన గ్లింప్స్ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెంచేసింది. ఇరవై ఏళ్ల జీవితాన్ని భారతదేశం కోసం అర్పించిన ఓ స్పై ఏజెంట్‌ను దేశ ద్రోహి అంటూ ముద్ర వేస్తే.. తనపై పడిన ముద్రను చెరిపేసుకోవడానికి తనకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలని దేశాన్ని కోరాడం, అంతవరకు దేశం కోసం పోరాడుతూనే ఉంటానంటూ చెప్పడం వంటివి ఆడియెన్స్‌లో ఉత్కంఠ రేకెత్తించాయి. గ్లింప్సే ఈ రేంజ్లో ఉంటే ట్రైలర్ ఇంకా ఎలా ఉంటుందో అని అప్పుడే సల్మాన్ ఫ్యాన్స్ ఊహల్లో తేలిపోతున్నారు. ఇక గత వారం రోజులుగా ట్రైలర్‌ను అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నట్లు పలు పోస్టర్లను మేకర్స్ అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.
కాగా తాజాగా ట్రైలర్ టైమ్‌ను సల్మాన్ అనౌన్స్ చేశాడు. టైగర్-3 ట్రైలర్‌ను అక్టోబర్ 16న మధ్యాహ్నం 12గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాపై హిందీ ఆడియెన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల కూడా అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా తొలిసారి సల్మాన్ సినిమాతో తెలుగులో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ కాబోతుంది. పైగా పటాన్, జవాన్ వంటి సినిమాలను తెలుగు ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్న తీరు చూసి.. టైగర్-3 మేకర్స్ కూడా డబ్బింగ్‌ను పర్ఫెక్ట్గా చేయించేలా ప్లాన్ చేస్తుంది. రిలీజ్‌కు ఎలాగో ఇంకొ నెల టైమ్ ఉంది గనుక.. తెలుగు, తమిళ భాషల్లో ప్రమోషన్లు కూడా భారీగా చేయాలని యష్ రాజ్ ఫిలింస్ సంస్థ ప్లాన్ చేస్తుందట.
టైగర్ సిరీస్‌లో మూడో ఫ్రాంచైజీగా రూపొందిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి డేట్‌ను లాక్ చేసుకుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుంది. గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.
#Tiger3Trailer. 16th October. 12 Noon. Mark kar lo calendar. #3DaysToTiger3Trailer #Tiger3 arriving in cinemas this Diwali. Releasing in Hindi, Tamil & Telugu. #KatrinaKaif | #ManeeshSharma | @yrf | #YRF50 | #YRFSpyUniverse pic.twitter.com/IeUJ5lFVv3
— Salman Khan (@BeingSalmanKhan) October 13, 2023