ముంబై, జనవరి 6: మహీంద్రా అండ్ మహీంద్రా మరో ఎస్‌యూవీని దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఎక్స్‌యూవీ 7ఎక్స్వో పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ప్రారంభ ధర రూ.13.66 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ.18.95 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే ఈ మాడల్‌కు బుకింగ్‌లు ప్రారంభించిన సంస్థ..ఏప్రిల్ నుంచి డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. 10.25 ఇంచుల హెచ్డీ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అలెక్స్ ఇంటగ్రేషన్, ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.
వాహన ధరలు పెంచేయోచనలో మహీంద్రా ఉన్నది. కమోడిటీ ధరలు దూసుకుపోతుండటం, రూపాయి పతనం చెందడంతో పడిన భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా వాహన ధరలు పెంచకతప్పదని మహీంద్రా అండ్ మహీంద్రా ఈడీ రాజేశ్ జేజురికర్ తెలిపారు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు, వచ్చే కొన్ని వారాల్లో నిర్ణ యం తీసుకునే అవకాశం ఉందన్నారు.