Tiger-3 Movie | దశాబ్దాలుగా హిందీ చిత్ర సీమలో రారాజుల కొనసాగుతున్న స్టార్లు సల్మాన్‌ఖాన్, షారుఖ్ ఖాన్. క్రేజ్ పరంగా, మార్కెట్ పరంగా వీళ్లని కొట్టేవారు లేరు. వీళ్ల సినిమాలు రిలీజవుతున్నాయంటే ఆ రోజు బాలీవుడ్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాదు బాలీవుడ్లో అత్యంత సన్నిహితులుగా వీరిరువురుని చెప్పుకుంటుంటారు. కాగా వీరిద్ధరి కలిసి సినిమా చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. పఠాన్‌లో పది నిమిషాలు కనిపిస్తేనే థియేటర్లు ఊగిపోయాయి. కేవలం వీరిద్దరిని స్క్రీన్‌పై చూడాడానికి రీపీటెడ్గా ఆడియెన్స్ వచ్చారన్న వార్తలు కూడా అప్పుడు వినిపించాయి.
ఇక మరో సారి వీరిద్దరూ కలిసి టైగర్-3లో కనిపించనున్నారు. ఈ సినిమాలో షారుఖ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. కాగా వీళ్లద్దరితో ఓ చేజ్ సీక్వెన్స్‌ను మేకర్స్ ప్లాన్ చేస్తు్న్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా దీనికోసం ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా సుమారు రూ.30 కోట్లు ఖర్చుపెట్టనున్నాడట. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లు ఈ ఫైట్ సీన్‌ను డిజైన్ చేస్తున్నారట. కనీవినీ ఎరుగని రీతిలో హాలీవుడ్ సినిమా చేజ్ సీన్‌కు ధీటుగా ఈ సీన్ ఉండనుందట. ప్రస్తుతం ఈ ఫైట్ సీన్ కోసం మేకర్స్ ప్రీ వర్క్ చేస్తున్నారట.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ నటిస్తుంది. ఇమ్రాన్ హష్మీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ స్పై సిరీస్‌లో ఈ మూవీ మూడో ఇన్స్టాలేషన్. గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టాయి.