Coolie-War 2 | ఈ మధ్య పెద్ద సినిమాలకి టిక్కెట్ రేట్స్ ఎంతగా పెంచుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. రాజమౌళి దీనికి బీజం వేయగా, అది డబ్బింగ్ సినిమాలకి కూడా కంటిన్యూ అవుతుంది. మరో రెండు రోజులలో వార్2, కూలీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆ మూవీ టిక్కెట్ ధరలు తెలంగాణ, ఏపీలో కూడా భారీగా పెరగనున్నాయని అంటున్నారు. మల్టిప్లెక్స్ ల్లో కూలి చిత్రానికి గాను ఒక్క టికెట్ కు రూ.350 ధరను నిర్ణయించగా,వార్ 2 చిత్రానికి 413 రూపాయలు ఒక్క టికెట్ ధరగా ఉండటం గమనార్హం. మల్టిప్లెక్స్ ల్లో అత్యధిక రేట్లు ఉన్న కారణంగా సింగిల్ స్క్రీన్ రేట్లు కూడా భారీగానే పెంచారు. రజనీకాంత్ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ కూలి చిత్రానికి రూ.200 ఉండగా, జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2కు రూ.250 టికెట్ ధరను నిర్ణయించినట్టు తెలుస్తుంది.
ఈ వార్త మూవీ లవర్స్ గుండెల్లో బాంబులు పేలుస్తోంది. అయితే కూలీ చిత్రానికి చెన్నైలో తక్కువ రేట్ కే టిక్కెట్ ధరలు ఉండటం గమనార్హం. ఒకే కార్పొరేట్ మల్టీప్లెక్సులోనే రెండు నగరాల్లో వేర్వేరు ధరలు ఉండటం పట్ల సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టికల్ గా చూస్తే రెండు డబ్బింగ్ సినిమాలే అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్, నాగార్జునలు నటించి స్వంతంగా డబ్బింగ్ చెప్పినంత మాత్రాన స్ట్రెయిట్ సినిమాలు కావు కదా అని కొందరు అంటున్నారు. డబ్బింగ్ సినిమాలకి కూడా తెలుగు రాష్ట్రాలలో టిక్కెట్ ధరలు అంత పెంచాల్సిన పని ఏంటని కొందరు మండిపడుతున్నారు. అయితే ఐ నుంచి భారతీయుడు 2 దాకా ఎన్నోసార్లు ఇలా పెంపులు తెచ్చుకుని వసూళ్లు చేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి.
తెలుగు సినిమాలు తమిళనాడు, కేరళలో రిలీజ్ అయినప్పుడు సరిపడా థియేటర్లు ఇవ్వడానికి అక్కడి డిస్ట్రిబ్యూటర్ ఎన్నో కారణాలు చెబుతారు. మన దగ్గర మాత్రం రజని, సూర్య, విక్రమ్ హీరో ఎవరైనా సరే హైకులు ఇవ్వడానికి ముందు ఉంటున్నారని సగటు ప్రేక్షకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాలకు హైక్స్ అంటే ఓకే కానీ డబ్బింగ్ సినిమాలకి , అది కూడా హై బడ్జెట్ లేని మిడ్ రేంజ్ సినిమాలకి కూడా ఇష్టానుసారంగా హైక్స్ పెంచేయడం ఏంటనే చర్చ జోరుగా నడుస్తుంది. ఓ పక్క కొందరు నిర్మాతలే హైక్స్ వలన జనం థియేటర్స్ కి రావట్లేదు అని గగ్గోలు పెడుతుండగా, మళ్లీ వాళ్లే పెంచుకుంటూ పోతే ఎలా అంటూ కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కూలీ చిత్రంకి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 2.5 లక్షల టికెట్లు బుక్ కాగా, 11 కోట్ల రూపాయల ఇండియా గ్రాస్ వసూలలైనట్టు సమాచారం. ఇక వార్ 2కు 56 వేల టికెట్లు బుక్ కావడంతో 4.5 కోట్ల రూపాయల ఇండియా గ్రాస్ వచ్చిందని ట్రేడ్ నిపుణులు స్పష్టం చేశారు.