HIT 3 Ticket Hikes | నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రమిది. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. మే 01న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమా టికెట్ ధరలను పెంచినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో టికెట్ ధరలకు అవకాశం లేకపోగా.. ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా టికెట్ రేట్లు పెంపునకు ప్రభుత్వం కూడా అనుమతినిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ మూవీ టికెట్లను రూ.50 నుంచి రూ.75 వరకు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా దీనిపై చిత్రబృందంతో పాటు ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.