Tillu Square | టాలెంటెడ్ యాక్టర్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టైటిల్ రోల్లో నటిస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్ టిల్లు 2 (Tillu Square). డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి తాజాగా టికెటే కొనకుండా (Ticket Eh Konakunda) సాంగ్ ప్రోమోను లాంఛ్ చేశారు మేకర్స్. సిద్దు షూస్ క్లీన్ చేస్తూ.. మనసు విరిగినట్టున్నది ఎక్కడ్నో.. ఉన్నడా బాయ్‌ఫ్రెండ్.. అంటూ అనుపమతో సిద్దు చిట్ చాట్ చేస్తున్న వీడియోతో సాంగ్ ప్రోమో అప్డేట్ అందించారు. జులై 26న ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేయనున్నారు మేకర్స్.
ఈ సారి డబుల్ డోస్ ఎంటర్టైన్ మెంట్ ఉండబోతున్నట్టు ప్రోమోతోనే క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ ట్యాక్సీలో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పోస్టర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల పోషిస్తున్నారు. మొత్తానికి ఈ సారి టిల్లు 2లో టైటిల్‌కు తగ్గట్టుగా డబుల్ ఎంటర్టైన్మెంట్తోపాటు రొమాన్స్ కూడా అదే రేంజ్లో ఉండబోతున్నట్టు తాజా ప్రోమోతో అర్థమవుతోంది.
టికెటే కొనకుండా ప్రోమో..
#TilluSquare – #TicketEhKonakunda Song Promo Out Now! 🤩🕺
Full Song on 26th July! 🔥 pic.twitter.com/BlTYUetPQi
— Fortune Four Cinemas (@Fortune4Cinemas) July 24, 2023
టిల్లు 2 ఫన్ ట్రాక్ వీడియో..