Tillu Square | టాలెంటెడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం టిల్లు 2 (Tillu Square). డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి హీరోహీరోయిన్ల చిట్‌చాట్‌తో టికెటే కొనకుండా (Ticket Eh Konakunda) సాంగ్ ప్రోమోను లాంఛ్ చేయగా.. మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. తాజాగా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. రామ్ మిర్యాల మ్యాజికల్ వాయిస్‌తో సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఫిదా చేయడం పక్కా అని తెలిసిపోతుంది.
కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను స్వీయ కంపోజిషన్‌లో రామ్ మిర్యాల పాడాడు. రామ్ మిర్యాల పాడిన డీజే టిల్లు టైటిల్ సాంగ్ సోషల్ మీడియాను ఏ రేంజ్లో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు మరోసారి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలువడం ఖాయమని తాజా సాంగ్‌తో అర్థమవుతోంది. టిల్లు 2 చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ ట్యాక్సీలో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పోస్టర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల పోషిస్తున్నారు. మొత్తానికి ఈ సారి టిల్లు 2లో టైటిల్‌కు తగ్గట్టుగా డబుల్ ఎంటర్టైన్మెంట్తోపాటు రొమాన్స్ కూడా అదే రేంజ్లో ఉండబోతున్నట్టు తాజా ప్రోమోతో అర్థమవుతోంది.
టికెటే కొనకుండా సాంగ్..
టికెటే కొనకుండా ప్రోమో..
టిల్లు 2 ఫన్ ట్రాక్ వీడియో..