ఇండియన్ క్లాసిక్ ‘నాయకుడు’ తర్వాత కమల్‌హాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘జింగుచా..’ సాంగ్‌కి అన్ని భాషల్లోనూ మంచి స్పందన వచ్చింది. మాఫియా నేపథ్యంలో సాగే ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని, ఎమోషన్స్‌తో నిండిన కథనమే ‘థగ్ లైఫ్’కి ప్రధాన బలమని మణిరత్నం తెలిపారు. ‘నాయకుడు’ స్థాయికి ఏ మాత్రం తగ్గని విధంగా ఇందులో కమల్‌హాసన్ పాత్ర చిత్రణ ఉంటుందని, శింబు పాత్ర కథకు బలాన్నీ, డైనమిజాన్ని ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
మణిరత్నం సినిమాల్లో ఉండే భావోద్వేగాలు ఇందులోనూ మెండుగా ఉంటాయని వారు తెలిపారు. జూన్ 5న సినిమా విడుదల కానుంది. త్రిషా కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సాన్య మల్హోత్రా, అశోక్ సెల్వన్, అభిరామి, ఐశ్వర్యలక్ష్మి, జోజు జార్జ్ కీలక పాత్రధారులు. ఈచిత్రానికి కెమెరా: రవి కె.చంద్రన్, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాత: ఉదయనిధి స్టాలిన్.