Hidimba Movie | ‘ప్రస్తుతం మైథాలజీ కాన్సెప్ట్‌లకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. చరిత్ర ఆధారంగా సాగే పరిశోధనాత్మక చిత్రంగా ‘హిడింబ’ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’ అన్నారు అనిల్ కన్నెగంటి. ఆయన దర్శకత్వంలో అశ్విన్‌బాబు, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20న విడుదలకానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ కన్నెగంటి మాట్లాడుతూ ‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాల్లో విభిన్న కథాంశమిది. సెకండాఫ్‌లో మనకు తెలియని చరిత్రను ఆవిష్కరిస్తుంది. చరిత్రలో రాసి ఉండని కొన్ని అంశాలు కూడా ఉంటాయి. అలాంటి ఓ పాయింట్‌కు కాల్పనిక అంశాలను జోడించి ఈ కథ సిద్ధం చేశా. ఈ సినిమాలో ఓ తెగ ఉంటుంది. వాళ్లకు హిడింబాసురుడి లక్షణాలు ఉంటాయి. అందుకే అదే టైటిల్ పెట్టాం. కేరళ, అండమాన్ దీవుల్లో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠను పంచుతాయి.
ఈ సినిమా ఇన్వెస్టిగేషన్ అంతా వర్తమానంలోనే జరుగుతుంది. దానికి 1908 నేపథ్యాన్ని జోడించడం ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమాలో ఓ షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సినిమా చూసిన వారు కథలోని మలుపుల గురించి ఎవరికీ చెప్పొద్దని కోరుతున్నా. సాంకేతికంగా కూడా ఉన్నతంగా చిత్రాన్ని తెరకెక్కించాం. ఓ దర్శకుడిగా జయాపజయాల గురించి అంతగా పట్టించుకోను. ఇండస్ట్రీలో ప్రయాణం సాగిస్తున్నాననే సంతృప్తి చాలు. నా తదుపరి చిత్రాలన్నీ చర్చల దశలో ఉన్నాయి’ అన్నారు.