Three Of Us Movie | టాలీవుడ్ (Tollywood) ప్రముఖ నిర్మాతలలో బన్నీ వాసు (Bunny Vasu) ఒకడు. 100 పర్సెంట్ లవ్ సినిమాతో జీఏ2 పిక్చర్స్(Ga2 Pictures) మొదలుపెట్టి గీతగోవిందం వరకు మంచి సినిమాలు నిర్మించి భారీ విజయాలు సాధించాడు. ఇక వరుస సినిమాలతో, వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న బన్నీవాసు తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
అల్లు ఫ్యామిలీ సొంత ప్రోడక్షన్ అయిన అల్లు ఎంటర్టైనమెంట్స్ (Allu Entertainaments) బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న బాలీవుడ్ చిత్రం త్రీ ఆఫ్ అస్ (Three Of Us). బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షెఫాలీ షా (Shefali Shah), పాతాల్ లోక్ ఫేమ్ జైదీప్ అహ్లావత్(Jaideep Ahlawath), స్వానంద్ కిర్కిరే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. అవినాష్ అరుణ్ ధావేర్ (Avinash Arun Dhawer) దర్శకత్వం వహిస్తున్నాడు. 2022లోనే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తాజాగా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. త్రీ ఆఫ్ అస్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు.
SHEFALI SHAH – JAIDEEP AHLAWAT – SWANAND KIRKIRE: ‘THREE OF US’ TRAILER OUT NOW… 3 NOV RELEASE… A heartfelt story of hope, healing and love… #ThreeOfUs stars #ShefaliShah, #JaideepAhlawat and #SwanandKirkire… In *cinemas* 3 Nov 2023.#ThreeOfUsTrailer 🔗:… pic.twitter.com/LpHb2W47xd
— taran adarsh (@taran_adarsh) October 26, 2023
ట్రైలర్ గమనిస్తే మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో విడిపోయిన స్నేహితులు 17 ఏండ్ల తర్వాత కలుసుకున్నాక వారి జీవితాల్లో ఏ జరిగింది అనేది స్టోరీ. లవ్ & ఎమోషనల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక IFFIలో ఇండియన్ పనోరమా 2022 కోసం ఎంపిక చేసిన 25 చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా చోటు దక్కించుకుంది.