Tholi Prema | తొలిప్రేమ, హ్యాపీ, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఏ కరుణాకరన్. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ పూజా కార్యక్రమంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. పాపులర్ డైరెక్టర్ వివి వినాయక్ ఫస్ట్క్లాప్ కొట్టాడు. అనుదీప్ కేవీ స్క్రిప్ట్ అందించి కెమెరా స్విచాన్ చేశారు.
భావోద్వేగపూరిత ప్రేమ కథలతో ప్రేక్షకులను కట్టిపడేసే కరుణాకరణ్ ఈ సారి ఎలాంటి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి డైరెక్టర్ అనుదీప్ కేవీ డైలాగ్స్ రాస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. గోల్డెన్ టర్టిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మౌనికా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. భీమ్స్సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. యూత్‌ఫుల్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
Valmiki Ramayana | ఆధ్యాత్మిక కలయిక.. ‘వాల్మీకి రామాయణం’ కోసం జతకట్టిన ఇళయరాజా!
Mahavatar Parshuraam | ధర్మ రక్షణ కోసం పరశురాముడి ఆగమనం.. ‘మహావతార్ పరశురామ్’ మోషన్ పోస్టర్ రిలీజ్