Pooja Hegde | దక్షిణాది అగ్ర కథానాయికల లిస్ట్ తీస్తే అందులో పూజాహెగ్డే టాప్ ప్లేస్‌లో ఉంటుంది. గ్లామర్ పాత్రలతో యూత్ మతులు పోగొడుతున్న ఈ పొడుకు కాళ్ల సుందరికి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుంది. గతేడాది వరకు గోల్డెన్ లెగ్ అన్న వారే ఇప్పుడు ఐరెన్ లెగ్ అని ముద్ర వేస్తున్నారు. ‘ముకుంద’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే అగ్ర కథానాయకులతో జోడీ కట్టి దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా పారితోషికంలోనూ ఈ అమ్మడే టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక ఇదిలా ఉంటే పూజాకు ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ‘రాధేశ్యామ్’ పూజాను కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారీ అంచనాల నడుమ ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుండి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ గాయాన్ని మరిచేలోపే ‘బీస్ట్’తో మరో డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తమిళంలో కాస్త పర్వాలేదనిపించిన ఇతర భాషల్లో మాత్రం ప్రీ బిజినెస్‌లో పావు వంతు కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. ఆ తర్వాత బోలెడు ఆశలు పెట్టుకున్న ‘ఆచార్య’ కూడా బెడిసికొట్టింది. నీలాంబరిగా నటన ప్రధాన్యమున్న పాత్రే పోషించిన.. సినిమా డిజాస్టర్ కావడంతో అందులోనే కొట్టుకుపోయింది.
ఇవన్నీ ఒకత్తయితే ‘సర్కస్’ మూవీ మరొక ఎత్తు. ‘హౌజ్‌ఫుల్-4’ తర్వాత దాదాపు మూడేళ్ళకు నేరుగా హిందీలో సినిమా చేయడంతో సర్కస్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అంతేకాకుండా ఏ సినిమాకు చేయలేని విధంగా ఈ మూవీ ప్రమోషన్లలో తెగ పాల్గోంది. కానీ, కారంలేని నాన్-వెజ్ కర్రీలా ‘సర్కస్’ మూవీ చప్పగా అయిపోయింది. ఎప్పుడో చూసేసిన కామెడీని రోహిత్ శెట్టి మళ్ళీ ప్లే బ్యాక్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. పైగా పూజా పాత్రకు ఇందులో స్కోపే లేదు. ఇలా నాలుగు సినిమాలు డిజాస్టర్లు కావడంతో పూజా హెగ్డేకు ఈ ఏడాది వరస్ట్ ఇయర్‌గా నిలిచిపోయింది.
ప్రస్తుతం పూజా ఆశలన్ని ‘SSMB28’ పైనే ఉన్నాయి. మరీ త్రివిక్రమ్ ఈ సారి పూజాకు బ్రేక్ ఇస్తాడో లేదో చూడాలి. దీనితో పాటుగా సల్మాన్ ఖాన్‌తో ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే యాక్షన్ కామెడీ సినిమా చేస్తుంది. వెంకటేష్, జగపతి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 23న రిలీజ్ కానుంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన ‘వీరమ్’కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. తెలుగులో ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేశాడు.