కుబేర
Kuberaa
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం కుబేర (Kuberaa on Prime) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రమఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ఈరోజు నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ నటుడు ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా.. ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించాడు. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.150 కోట్లకి పైగా వసుళ్లను రాబట్టింది ఈ చిత్రం.
స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2
Special Ops
ప్రముఖ ఓటీటీ జియో హాట్‌స్టార్‌లో వచ్చిన స్పెషల్ ఓపీఎస్ (Special OPS) వెబ్ సిరీస్‌కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్ సీరిస్ నుంచి సెకండ్ సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట జూలై 11న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్ జూలై 18కి వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ సిరీస్ నేడు జియోహాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు కేకే మీనన్ (Kay Kay Menon) ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు.
DNA
My Baby
ఇటీవల తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన చిత్రం ‘DNA’. తెలుగులో ‘మై బేబీ’ పేరుతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమిళ నటుడు అథర్వ మలయాళం నటి నిమిషా సజయన్ కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి ఈ సినిమాను తెలుగులోకి తీసుకువచ్చాడు. ఇదిలావుంటే ఈ సినిమా తెలుగులోకి వచ్చిన రోజే మూవీ ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను ఇచ్చింది జియోహాట్‌స్టార్. ఈ సినిమాను శనివారం నుంచి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది.
భైరవం
Bhairavam
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భైరవం. మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించారు. తమిళంలో సూపర్ హిట్టైన ‘గరుడన్’ చిత్రానికి ఇది రీమేక్‌గా వచ్చింది. ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధా మోహన్ ఈ సినిమాను నిర్మించారు. మే 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. జీ5 ఓటీటీ వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవే కాకుండా బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ నటించిన ‘భూత్నీ’ (జీ5) (The Bhootnii), అక్షయ్ కుమార్ నటించిన హౌస్‌ఫుల్ 5(ప్రైమ్ వీడియో), చిత్రాలు ఈరోజు ఓటీటీలోకి వచ్చేశాయి.