ఎప్పటిలాగే ఈ వారం కూడా బిగ్ బాస్ 5 (Bigg Boss Season 5 Telugu) తెలుగులో నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా జరిగింది. గత వారం జెస్సీ (jessie ) అనారోగ్యం కారణంగా ఇంట్లో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత..ఇంట్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నిజానికి గతవారం కాజల్ ఎలిమినేట్ అవ్వాల్సింది. ఓటింగ్ పరంగా ఆమెకు చాలా తక్కువ పర్సంటేజ్ వచ్చింది. కానీ జెస్సీ కారణంగా ఇంకా ఇంట్లో ఉంది కాజల్. దాంతో ఈ వారం నామినేషన్స్ (Bigg Boss Season 5 Nominations) మరింత ఆసక్తికరంగా జరిగాయి. ముఖ్యంగా బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ ప్రక్రియ డిజైన్ చేసిన తీరు కూడా అత్యంత ఆసక్తికరంగా మారింది.
మనసులో ఏదీ దాచుకోకుండా.. ఒకరిపై ఒకరికి ఉన్న ఫీలింగ్స్ దాపరికం లేకుండా.. నిజాలు మాత్రమే చెప్పాలని బిగ్ బాస్ సూచించాడు. ఈ నామినేషన్ ప్రక్రియ అందుకే కీలకమైంది అంటూ పదే పదే గుర్తు చేశాడు బిగ్ బాస్. ముందుగా ఏ ఇద్దరు సభ్యులను అయితే వాళ్లు నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ల తలపై నూనె లాంటి పదార్థం పూర్తిగా పోయాల్సి ఉంటుంది. ఇలా చివరి వరకు ఎంత మంది ఎక్కువగా నామినేట్ అవుతారో వాళ్లు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేషన్స్ లో ఉంటారు.
ఈ క్రమంలోనే కెప్టెన్ యాంకర్ రవి మినహాయిస్తే మిగిలిన 8 మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు అని తెలుస్తోంది. అందులో శ్రీ రామచంద్ర కేవలం ఒకే ఒక ఓటుతో నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కాజల్, అని మాస్టర్ మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. మరో వైపు యాంకర్ రవి, సన్నీ మధ్య కూడా డిస్కషన్ బాగానే జరిగింది. కేవలం ఇంటి కెప్టెన్ మినహాయిస్తే మిగిలిన ఇంటి సభ్యులు అందరూ నామినేట్ కావడం ఇది రెండోసారి. రెండు వారాల కింద కూడా ఇలాగే జరిగితే బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చి అందులో ఇద్దరిని సేవ్ చేసాడు.
మరి ఈ వారం అలా చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి మానస్, కాజల్, సన్నీ, సిరి, యాంకర్ రవి, ప్రియాంక, శ్రీ రామచంద్ర, అని మాస్టర్ నామినేట్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ప్రియాంక సింగ్ ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లిపోనుంది. తన ఆట ఆడకుండా త్యాగాలు చేస్తూ పూర్తిగా నెగిటివ్ వైబ్రేషన్స్ తెచ్చుకుంది ప్రియాంక సింగ్. ప్రస్తుతం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ లో బాగా వీక్ కూడా ఈమె. మొత్తానికి ఈ వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha As Khatija | సమంత పాత్రను పరిచయం చేసిన డైరెక్టర్..
Prakash Raj silence | నా గొంతుకు వారం విశ్రాంతి..ప్రకాశ్‌రాజ్ ట్వీట్ వైరల్
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి