Bigboss 6 Telugu Elimination | ఈ సారి ఎలిమినేషన్ ముందే లీక్..బయటికి వచ్చేదెవరంటే..?
బిగ్ బాస్ (Bigboss 6 Telugu)లో జరిగేవన్నీ చాలా సీక్రెట్ గా ఉంచాలని నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటారు. కానీ వారం రోజుల ముందు నుంచి లీక్ అయిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో వాళ్ళు ఎంత దాచి పెట్టాలి అనుకున్న కూడా.. ఎవరు బయటకు వెళ్ళిపోతున్నారు అనేది తెలిసిపోతుంది.
బిగ్ బాస్ (Bigboss 6 Telugu)లో జరిగేవన్నీ చాలా సీక్రెట్ గా ఉంచాలని నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటారు. కానీ వారం రోజుల ముందు నుంచి లీక్ అయిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో వాళ్ళు ఎంత దాచి పెట్టాలి అనుకున్న కూడా.. ఎవరు బయటకు వెళ్ళిపోతున్నారు అనేది తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ వారం కూడా ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతున్నారు అనేది.. మూడు నాలుగు రోజుల ముందు నుంచే వైరల్ అవుతూ వస్తుంది. మరీ ముఖ్యంగా ఓటింగ్ విషయంలో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు.
ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచి ఎవరు బయటకు వస్తారనేది (Elimination) ముందుగానే తెలిసిపోతుంది. ఈ వారం నామినేషన్స్ లో ఏకంగా 10 మంది ఉన్నారు. అందులో రేవంత్, గీతూ (Geetu Royal), శ్రీహాన్, బాలాదిత్య, చంటి లాంటి వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఇప్పట్లో వీళ్ళు బయటికి వచ్చే ఛాన్స్ లేదు. మిగిలిన వాళ్ళలో కూడా నేహా అందరికంటే ముందుంది. వీళ్లు కాకుండా ఈ వారం వాసంతి, ఇనయా సుల్తానా, ఆరోహి, సుదీప నామినేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ నలుగురులో వాసంతికి అందరికంటే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఆ తర్వాత ఆరోహి ఉంది.
ఈ వారం డేంజర్ జోన్లో..
అంటే ఈ వారం డేంజర్ జోన్ (Danger Zone)లో ఇనయా, సుదీప ఉన్నారు. ఇంట్లో అందరితో కలుపుగోలుగా ఉంటూ.. వంట చేస్తూ టాస్క్ లోను పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుదీప.. ఇప్పట్లో ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టమే. దాంతో ఎటువైపు నుంచి చూసుకున్న ఈ వారం ఇనాయా ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పైగా మొన్న జరిగిన నామినేషన్స్ లో తలా తోక లేకుండా ఈమె వాదించిన తీరు ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.
ఇంట్లో ఏ విషయం జరిగినా కూడా వెంటనే దూరిపోయి.. అసలు మేటర్ తెలియకుండా నోరు వేసుకొని పడిపోతుంది అంటూ విమర్శలు కూడా మూటగట్టుకుంటుంది ఈమె. పాయింట్ మాట్లాడకుండా అనవసరంగా సాగదీస్తూ ఆడియన్స్ ను ఇరిటేట్ చేస్తున్న ఇనాయా..ఈ వారం ఇంటి నుంచి బయటకు రావడం లాంచనమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి..ఇదే జరుగుతుందా..? లేదంటే చివరి నిమిషంలో బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా అని..!
Read Also : Geetu Royal | గీతూ ఆట తీరుపై విమర్శలు..బిగ్ బాస్‌లో ఆమెను కావాలనే హైలైట్ చేస్తున్నారా..?
Read Also : Raju Srivastava | ఆటో డ్రైవర్ నుంచి.. స్టార్ కమెడియన్‌గా ఎదిగిన రాజు శ్రీవాస్తవ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

