Gangs of Godavari | మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) నటిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari). ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. మే 31న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ అందించారు మేకర్స్.
మే 28న నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరుకాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. బాలయ్య ఎంట్రీతో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలకృష్ణ 109వ సినిమాలో విశ్వక్సేన్కు డైరెక్టర్ బాబీ ఓ రోల్ ఆఫర్ చేయగా.. పలు కారణాల వల్ల మాస్ కా దాస్ తిరస్కరించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అయేషా ఖాన్, సాయి కుమార్, గోపరాజ్ రమణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ మూవీ నుంచి ఇప్పటికే మాస్ కా దాస్ కత్తి చేతపట్టుకొని శత్రువులను చీల్చి చెండాతున్నట్టుగా ఉన్న లుక్, హీరోహీరోయిన్ల లిప్‌లాక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన సుట్టంలా సూసి పోకలా సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. అడవికి గొడ్డలి బ్యాడ్.. కడుపుకి అంబలి బ్యాడ్.. మట్టికి నాగలి బ్యాడ్ అంటూ సాగే మరో పాట సినిమాకు హైలెట్‌గా నిలిచేలా సాగుతోంది.
ఈ చిత్రంలో విశ్వక్సేన్ లంకల రత్నగా ఊరమాస్ అవతార్‌లో కనిపించబోతున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
మన మీదకి ఎవడైనా వస్తే వాడి మీద పడిపోవటమే! 👊
1️⃣ 𝑴𝒊𝒍𝒍𝒊𝒐𝒏+ 𝑽𝒊𝒆𝒘𝒔 & counting for #GangsofGodavari Trailer in just 2 Hours 💥
Mass Ka Das @VishwakSenActor’s #GOG worldwide grand release at theatres near you on MAY 31st! 🌊🔥#GOGOnMay31st 💥 pic.twitter.com/OxXZj0vbH0
— Fortune Four Cinemas (@Fortune4Cinemas) May 25, 2024
𝐋𝐚𝐧𝐤𝐚𝐥𝐚 𝐑𝐚𝐭𝐡𝐧𝐚 𝐗 𝐑𝐚𝐧𝐠𝐚 𝐂𝐡𝐞𝐭𝐚 😎
ఈసారి ఒక్కోక్కడికి శివాలెత్తిపోద్దంతే!! 💥
Mass Ka Das @VishwakSenActor’s #GangsOfGodavari is Hitting theatres worldwide on MAY 31st! 🌊🔥#GOGOnMay31st 💥 pic.twitter.com/6s7lve5JUX
— BA Raju’s Team (@baraju_SuperHit) May 16, 2024
బ్యాడ్ సాంగ్..
మోత లిరికల్ సాంగ్..
పందెంకోడితో విశ్వక్సేన్..
Team #GangsOfGodavari wishes you all a prosperous and delightful Sankranthi! #HappySankranthi 🌾✨
GANGS OF GODAVARI will arrive in theatres on 8th March, 2024! 💥 pic.twitter.com/2hwbtyUOcf
— VishwakSen (@VishwakSenActor) January 15, 2024
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్సేన్, నేహాశెట్టి డ్యాన్స్..