గాయకుడు శ్రీరామచంద్ర, గాయత్రి చాగంటి, రాశీ సింగ్, శ్రీవిద్య మహర్షి ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘పాపం పసివాడు’. లలిత్ కుమార్ దర్శకుడు. ఈ సిరీస్ ఈ నెల 29 నుంచి ‘ఆహా’ ఓటీటీలో విడుదల కానుంది. ఈ సిరీస్ ట్రైలర్‌ని ‘కలర్‌ఫొటో’ దర్శకుడు సందీప్‌రాజ్ విడుదల చేశారు.
అయిదు ఎపిసోడ్ల ఈ సిరీస్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని, శ్రీరామచంద్ర ఇందులో విఫలప్రేమికుడిగా నటిస్తున్నాడని, అతడ్ని ముగ్గురమ్మాయిలు ప్రేమిస్తారని, ఈ నేపథ్యంలో కామెడీగా ఈ సిరీస్ సాగుతుందని దర్శకుడు చెప్పారు. మంచినటులు, సాంకేతికనిపుణులతో పనిచేయడం ఆనందంగా ఉందని శ్రీరామచంద్ర అన్నారు.