‘ఇది ప్రేమ నేపథ్యంలో సాగే క్రైమ్ స్టోరీ. ఇందులో క్రిమినల్ లాయర్‌గా నటించాను. కథాగమనంలో నెమ్మదిగా నాలోని ఒక్కో షేడ్ బయట పడుతుంది. క్రిమినలా? లేక క్రిమినల్ లాయరా? అన్నట్టుగా నా కేరక్టర్ ఉంటుంది. నా కెరీర్లో ఇలాంటి పాత్ర చేయడం ప్రథమం’ అని సాయిరామ్‌శంకర్ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ పథకం ప్రకారం’. మలయాళ దర్శకుడు వినోద్‌కుమార్ విజయన్ స్వీయదర్శకత్వంలో గార్లపాటి రమేష్‌తో కలిసి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సాయిరామ్‌శంకర్ మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. ‘ఇది 80శాతం క్రైమ్ జానర్. ఈ కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. నా పాత్రకోసం నెలరోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. వర్క్ షాప్స్ కూడా చేశాను. వినోద్ మలయాళ దర్శకుడైనప్పటికీ తెలుగు సినిమాలంటే ఆయనకిష్టం. ఇక్కడి ైస్టెల్‌ని బాగా ఇష్టపడతారు. అందుకు తగ్గట్టే సినిమా తీశారు. కథ డిమాండ్ మేరకు చాలా రిస్కీ ఫైట్స్ చేశాను. ఎనిమిది రోజులు ైక్లెమాక్స్ షూట్ చేశాం. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నా.’ అని తెలిపారు సాయిరామ్‌శంకర్.