కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. హిందీ, తెలుగుతోపాటు వివిధ భాషల ప్రేక్షకులు కథాబలమున్న సినిమాలను ఆదరిస్తారు. అయితే కోవిడ్ ఎఫెక్ట్‌తో పలు పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. వీటిలో హిందీ చిత్రాలు లక్ష్మీ (Laxmii), హంగామా 2 (Hungama 2), అట్రాంగి రే (Atrangi Re) ఉన్నాయి. ఈ మూడు డిజిటల్ ప్లాట్ ఫాం డిస్నీ+హాట్ స్టార్‌లో విడుదలయ్యాయి.
డిసెంబర్ 24న విడుదలైన అట్రాంగి రే చిత్రం అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లక్ష్మీ సినిమాతోపాటు శిల్పాశెట్టి, పరేశ్‌రావల్, ప్రణీత నటించిన హంగామా 2 చిత్రాలను బీట్ చేసింది. విడుదలైన మొదటి రోజు ఎక్కువమంది వీక్షించిన (Most watched film) సినిమాగా అట్రాంగి రే నిలిచింది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన అట్రాంగి రేలో అక్షయ్‌కుమార్, సారా అలీఖాన్, ధనుష్ ప్రధాన పాత్రలు పోషించారు.
డిస్నీ స్టార్ ఇండియా కంటెంట్ డిస్నీ+ హాట్‌స్టార్, హెచ్ఎస్ఎమ్ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ హెడ్ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ..మా అట్రాంగి రే చిత్రానికి వస్తున్న ప్రశంసలతో థ్రిల్ అయ్యాం. మా ప్లాట్‌ఫాం అసాధారణమైన, వినోదాత్మక కథనాలను అందించమే లక్ష్యంగా పెట్టుకుంది. అట్రాంగి రే దీనికి సరిగ్గా సరిపోతుందన్నారు.