స్వీయ దర్శకత్వంలో హీరో రామ్ పోతినేని నటిస్తున్న సినిమా త్వరలో పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ‘రాపో23’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తొలిసారి తాను దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై రామ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. జాతీయ స్థాయిలో పేరుపొందిన సాంకేతిక నిపుణుల్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తున్నది.
ప్రస్తుతం సీనియర్ ప్రొడక్షన్ డిజైనర్ ఏ.ఎస్.ప్రకాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో సెట్స్‌ని తీర్చిదిద్దుతున్నారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు 100కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ ఇదని, వీర పాత్రలో ఆయన సరికొత్త అవతారంలో కనిపిస్తారని మేకర్స్ చెబుతున్నారు. ‘రాపో’ సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.