The Great Pre Wedding Show | సిన్(Sin), మసూద(Masooda), పరేషాన్(Pareshan) వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ యువ నటుడు తెలంగాణ పోరడు తిరువీర్(ThiruVeer) మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (The Great Pre Wedding Show). టీనా శ్రావ్య కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాసన్ కథను అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తుండగా.. 7ఎమ్ ప్రోడక్షన్ బ్యానర్‌పై సందీప్ అగారం, అస్మిత రెడ్డి బాసాని, కల్పాన రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే.. ప్రస్తుతం నడుస్తున్న ప్రీ వెడ్డింగ్ షూట్ ఆధారంగా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. తిరువీర్ ఇందులో ఫోటోగ్రాఫర్‌గా కనిపించబోతున్నాడు. నవ్వులు పూయించేలా ఉన్న ఈ టీజర్‌ను మీరు చూసేయండి.