Thiruveer | టాలీవుడ్ యువ నటుడు తిరువీర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భగవంతుడు’. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పల్నాడు నేపథ్యంలో ఈ సినిమా రాబోతుండగా.. తాజాగా చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. పల్లెటూరి నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్లో చూపించిన విజువల్స్ మరియు తిరువీర్ పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ సినిమాపై భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మసూద, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి చిత్రాలతో నటుడిగా తన సత్తా చాటిన తిరువీర్ ఇందులో మరో విభిన్నమైన మరియు భావోద్వేగపూరితమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
జీజీ విహారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రవి పనస ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై రవి పనస నిర్మిస్తుండగా ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. రిషి నాగరాజు, కాలకేయ ప్రభాకర్, రవీంద్ర విజయ్, మురళిధర్ గౌడ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది.