‘సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. మేం పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. కుటుంబసమేతంగా సినిమాకు వెళ్లండి. అందరికీ నచ్చుతుంది. సెకండాఫ్, ైక్లెమాక్స్ బావుందని అందరూ అంటున్నారు. కొత్తవాళ్లతో సినిమా చేశాం. ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని చిత్రనిర్మాత కిరణ్ అబ్బవరం అన్నారు. కొత్త తారలైన సాయితేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ, లతీశ్ ముఖ్య పాత్రలు పోషించిన పీరియడ్ కామెడీ ఎంటర్టైనర్ ‘తిమ్మరాజుపల్లి టీవీ’. వి.మునిరాజు దర్శకుడు. శుక్రవారం సినిమా విడుదలైంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. సినిమా చూసినవారంతా తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారని, ఈ సంతోషం కోసమే రెండున్నరేళ్లు కష్టపడ్డామని దర్శకుడు మునిరాజు చెప్పారు. ఇంకా హీరోహీరోయిన్లు సాయితేజ్, వేద జలంధర్తో పాటు చిత్రబృందమంతా మాట్లాడారు.