Anupam Kher | బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఆఫీస్‌లో దొంగలు పడ్డారు. తన ఆఫీస్‌లో డబ్బులను దాచే సేఫ్ లాకర్‌తో పాటు ఓ మూవీ నెగెటివ్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
అనుపమ్ చెప్పిన వివరాల ప్రకారం.. ముంబయిలోని వీర దేశాయ్ రోడ్‌లోని నా ఆఫీసులో నిన్న రాత్రి ఇద్దరు దొంగలు పడ్డారు. నా ఆఫీసు డోర్ పగులగొట్టి, అకౌంట్స్ డిపార్ట్మెంట్లోని లాకర్‌తో పాటు ఓ ఫిల్మ్ నెగిటివ్‌ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఓ ఆటోలో పరారయ్యారు ఇవన్నీ కూడా ఆఫీస్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడం వల్ల అసలు విషయం బయటపడింది అంటూ అనుపమ్ ఖేర్ ఓ వీడియో ద్వారా సోషల్ మీడియాలో తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.