Fauzi | ‘ఫౌజీ’ విజువల్స్ చూసి మైండ్ బ్లాక్ అయింది.. ప్రభాస్ సినిమాపై నాగవంశీ షాకింగ్ కామెంట్స్!
Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘సీతారామం’ ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో రాబోతున్న హిస్టారికల్ పీరియడ్ వార్ అండ్ లవ్ డ్రామా ‘ఫౌజీ’పై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Hanu Raghavapudi | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘సీతారామం’ ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో రాబోతున్న హిస్టారికల్ పీరియడ్ వార్ అండ్ లవ్ డ్రామా ‘ఫౌజీ’పై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హను రాఘవపూడి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ పాన్-ఇండియా విజువల్ వండర్‌ను నిర్మిస్తోంది. వచ్చే వింటర్ కానుకగా, డిసెంబర్ 2026లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పంచుకున్న ఒక క్రేజీ అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ తనకు ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించిన కొన్ని రషెస్ చూపించారని, అవి చూశాక తనకు మైండ్ బ్లాక్ అయిందని నాగవంశీ పేర్కొన్నారు. చిత్ర యూనిట్ ఈ సినిమాను మనం ఊహించని రేంజ్లో, ఒక సరికొత్త హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిస్తోందని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. నాగవంశీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్‌గా మారడంతో, ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే సినిమా ప్రమోషన్స్ షురూ చేయాలని, అఫీషియల్ టీజర్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలంటూ ఫ్యాన్స్ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన చిత్రంతో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్గా వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం. అలాగే బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, సీనియర్ నటి జయప్రద, రాహుల్ రవీంద్రన్, చైత్ర జె. ఆచార్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

