Nora Fatehi | గోల్డ్ డిగ్గర్ అంటూ తనను అవమనించారని, మనీలాండరింగ్ కేసులో తనను బలి పశువును చేశారని బాలీవుడ్ ఐటమ్ బాంబ్ నోరా ఫతేహి ఆవేదన వ్యక్తం చేసింది. సుకేశ్ చంద్రశేఖర్‌కు చెందిన మనీలాండరింగ్ కేసులో మరో బాలీవుడ్ నటి జాక్వెలైన్ ఫెర్నాండ్తో పాటు పలు మీడియా సంస్థలపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నోరా పటియాలా హౌస్కోర్టుకు హాజరైంది. ఈ సందర్భంగా తన వాదనలు వినిపించింది. తనను గోల్డ్ డిగ్గర్ పిలువడంతో పాటు మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్‌తో తనకు సంబంధాలు అంటగట్టారని ఆరోపించింది. జాక్వెలిన్‌పై దృష్టిని మళ్లించేందుకు కేసులోకి తన పేరును లాగారని, తప్పుడు కథనాలతో ప్రజల దృష్టిలో తన ప్రతిష్టను దిగజార్చారని పేర్కొంది.
కేసులో తన పేరును తీసుకురావడంతో ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయారని, మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమైందని తెలిపింది. రూ.200కోట్ల దోపిడీ కేసులో తన పేరును సాక్షిగా ఎందుకు చేర్చారని ప్రశ్నించింది. తాను బయటి దేశానికి చెందిన వ్యక్తినని, తాను దేశంలో ఒంటరిగా ఉన్నందున కొందరు వ్యక్తుల ప్రతిష్టను కాపాడేందుకు ఈ కేసులో తనను బలిపశువుగా చేశారని వాగ్మూలంలో నోరా ఫేర్కొంది. గత ఎనిమిది సంవత్సరాలుగా కెరియర్ కోసం అవిశ్రాంతంగా శ్రమించానని, కెరియర్‌కు భంగం వాటిల్లినందున తనకు పరిహారం లభించాలని నోరా ఫతేహి స్పష్టం చేసింది. మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేసులో ఈడీ విచారణ కొనసాగుతుందని పేర్కొంది.