శర్వానంద్ కెరీర్‌కు ఆ రెండు సినిమాలే కీలకం ఇప్పుడు..

Sharwanand | ప్రస్తుతం శర్వానంద్ కెరీర్ పూర్తిగా డైలామాలో ఉంది. ఒకప్పుడు కేవలం మంచి సినిమాలు మాత్రమే కమర్షియల్ విజయాలకు దూరంగా ఉన్నాడు. అలాంటి సమయంలో రన్ రాజా రన్ వచ్చింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈయన. కమర్షియల్‌గా తన రేంజ్ రూ.15 కోట్లకు పైగా పెంచుకున్నాడు. శతమానం భవతి ఏకంగా రూ.33 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి శర్వానంద్ మార్కెట్ అమాంతం పెంచేసింది. 2017 సంక్రాంతి ఆ సినిమా విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ కెరీర్లో సూపర్ హిట్ లేదు. మధ్యలో విడుదలైన చాలా సినిమాలు అంచనాలను అందుకోలేక చతికిలపడ్డాయి.
భారీ అంచనాలతో విడుదలైన జానూ, రణరంగం, శ్రీకారం, మహా సముద్రం సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. మొన్న దసరాకు అజయ్ భూపతి తెరకెక్కించిన మహా సముద్రం విడుదలైంది. ఇందులో సిద్ధార్థ మరో హీరోగా నటించాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా నిరాశ పరిచింది. ఈ సమయంలో శర్వానంద్ కెరీర్ మొదలుపెట్టిన దగ్గరకే వస్తుంది. కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ అందుకుంటే తప్ప ఈయన మార్కెట్ మళ్లీ పుంజుకోవడం కష్టం. ప్రస్తుతం ఈయన కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ తెరకెక్కిస్తున్న ఒకే ఒక జీవితం సినిమాలో నటిస్తున్నాడు సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అక్కినేని అమల ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇంకా కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు శర్వానంద్. ఈ రెండు సినిమాలే ప్రస్తుతం ఈ హీరో కెరీర్ ను డిసైడ్ చేయనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
2021లో సక్సెస్ ఫుల్ డెబ్యూ చేసిన హీరోలు వీళ్లే..
Samantha item song | టాప్ ఫామ్‌లో ఉన్నపుడే ఐటమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే.
వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే..
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

