Tollywood | సెప్టెంబర్ నెల సక్సెస్ ఫుల్‌గా ముగిసింది. ఈ నెల చివరలో వచ్చిన ఓజీ చిత్రం సినీ ప్రియులకి సరికొత్త థ్రిల్ అందించింది. దానితో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులని అలరించాయి. ఇక 2025 అక్టోబర్ నెల తెలుగు సినీ ప్రేక్షకులకు నిజంగా పండగలా ఉండబోతోంది. అక్టోబర్ మొదటి వారంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 చిత్రం మంచి విజయం సాధించింది. ఈ నెలలో పలు విభిన్నమైన సినిమాలు, ప్రముఖ హీరోల సినిమాలు, స్వీయ దర్శకత్వ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పుడు అక్టోబర్ నెలలో విడుదల కానున్న ప్రధాన సినిమాల లిస్ట్ చూస్తే..
ఈ నెలలో అంటే అక్టోబర్ 1న ఇడ్లీ కొట్టు విడుదల కాగా, ఈ చిత్రంలో హీరోగా ధనుష్ నటించారు. హీరోయిన్గా నిత్యా మీనన్ నటించింది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో ఇడ్లీ కడై పేరుతో విడుదలైంది. తెలుగు వెర్షన్‌పై అంచనాలు భారీగా ఉన్నా మూవీ కాస్త నిరాశపరిచింది. ఇక అక్టోబర్ 2న విడుదలైన కాంతార చాప్టర్ 1 చిత్రం మాత్రం మంచి విజయం సాధించింది. రిషబ్ శెట్టి డైరెక్టర్‌గా, నటుడిగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది. భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా చిత్రంగా ఈ మూవీ రిలీజై వసూళ్ల వర్షం కురిపిస్తుంది. కాంతార ఫ్రాంచైజ్ కు ప్రీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది.
అక్టోబర్ 10న శశివదనే, మారియో, సీత ప్రయాణం కృష్ణతో, ట్రాన్స్ ఎరిస్, ఎర్ర చీర, కానిస్టేబుల్ చిత్రం విడుదల కానుండగా, అక్టోబర్ 16న మిత్రమండలి, అక్టోబర్ 17న తెలుసు కదా (సిద్దు జొన్నలగడ్డ హీరోగా), ఫ్రెండ్లీ ఘోస్ట్‌గా చిత్రం రూపొందగా, డ్యూడ్, కాంత విడుదల కానుండగా, అక్టోబర్ 18న కె-ర్యాంప్ విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం తండ్రిగా మారిన తర్వాత తొలి సినిమా ఇది. ఇక అక్టోబర్ 31న బాహుబలి: ది ఎపిక్ చిత్రం విడుదల కానుండగా, ఈ సినిమాకి పోటీగా మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో మాస్ జాతర చిత్రం కూడా రిలీజ్ కానుంది. మాస్ జాతర – రవితేజ మాస్ జాతర కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అక్టోబర్ నెల కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి కలర్‌ఫుల్ సీజన్ కానుంది. పెద్ద స్టార్లతో పాటు, కొత్త ప్రయోగాలు చేసే చిన్న చిత్రాలు కూడా పోటీలో నిలుస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి ది ఎపిక్, మాస్ జాతర వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించే అవకాశముంది. మరి ఈ సినిమాలలో ఏ సినిమా ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.