2022 రౌండప్.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డబ్బింగ్ సినిమాల వాహ
లాక్‌డౌన్‌తో డైలామాలో పడ్డ థియేటర్ల వ్యవస్థ మాత్రం 2022లో మళ్లీ గాడిలో పడిందని చెప్పొచ్చు. మూవీ లవర్స్ ను ఎప్పటిలాగా థియేటర్లకు రప్పించడంలో తెలుగు సినిమాలు ముందున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
కోవిడ్ ఎఫెక్ట్‌తో కుదేలైన సినీ పరిశ్రమకు 2022 బాగా కలిసొస్తుందని ప్రారంభంలో చాలా ఆశాభావంతో ఉన్నారు దర్శకనిర్మాతలు. అయితే వారి అంచనాలకు ఈ ఏడాది చేరుకుందా..? లేదా..? అనేది పక్కన పెడితే.. లాక్‌డౌన్‌తో డైలామాలో పడ్డ థియేటర్ల వ్యవస్థ మాత్రం 2022లో మళ్లీ గాడిలో పడిందని చెప్పొచ్చు. మూవీ లవర్స్ ను ఎప్పటిలాగా థియేటర్లకు రప్పించడంలో తెలుగు సినిమాలు ముందున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే మేమేం తక్కువా.. మా రేంజ్ ఏంటో చూపిస్తాం.. అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డబ్బింగ్ సినిమాలు (Dubbing Films 2022)కూడా ఉన్నాయి.

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగించిన డబ్బింగ్ సినిమాల్లో ప్రముఖంగా గుర్తొచ్చేది కేజీఎఫ్ 2. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక గ్రాస్ సాధించిన డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది కేజీఎఫ్ 2 (KGF2). ఈ చిత్రం చాలా తెలుగు సినిమాలను సైతం వెనక్కి నెట్టింది. కొన్ని తెలుగు సినిమాలు కూడా వాయిదా వేసుకునేంతలా ప్రభంజనం సృష్టించింది. అయితే సినీ జనాలు ఈ కన్నడ సినిమా రికార్డుల గురించి చర్చించుకుంటున్న సమయంలోనే మరో శాండల్ వుడ్ సినిమా కూడా నేనేంటో చూపిస్తానంటూ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సర్ప్రైజ్ విన్నర్ కాంతార..

ఇంతకీ ఈ సినిమా ఏంటో ఊహించే ఉంటారు. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన కాంతార (Kantara). ఎవరూ ఊహించిన విధంగా బాక్సాఫీస్ సర్ప్రైజ్ విన్నర్‌గా నిలిచిందీ కన్నడ డబ్బింగ్ సినిమా. మొదట కన్నడ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కాంతార.. మెల్లగా తెలుగు ఇండస్ట్రీ, హిందీ ఇండస్ట్రీలపై పంజా విసిరింది. ఈ సినిమాతో రిషబ్ శెట్టి నేషనల్ హీరో అవడమే కాదు.. కాంతాలరో వచ్చే వరాహరూపం క్లాసికల్ హిట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.
విజువల్ వండర్ అవతార్ 2..
![]()
ఇదే లైన్లో వచ్చిన మరో చిత్రం లవ్ టుడే. ప్రదీప్ రంగనాథన్, ఇనయా హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం లవ్ టుడే (Love Today). తెలుగులో కూడా లవ్ టుడే విడుదలై మంచి వసూళ్లు రాబట్టి.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇక తెలుగులో డబ్ అయిన విజువల్ వండర్ అవతార్ 2 (Avatar 2). జేమ్స్ కామెరూన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ ఏడాది సర్దార్, విక్రాంత్ రోన సినిమాలు కూడా తెలుగులో మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

అయితే పొన్నియన్ సెల్వన్ -1, బ్రహ్మాస్త్ర, ది కశ్మీర్ ఫైల్స్ మాత్రం తెలుగులో అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. మొత్తానికి 2022లో మాత్రం డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇదే జోష్‌లో 2023లో కూడా డబ్బింగ్ సినిమాలు తమ హవా కొనసాగిస్తాయా..? లేదా.. ? అన్నది చూడాలి.
Read Also : Dil Raju | బాక్సాఫీస్ బరిలో విజయ్-అజిత్.. పోటీపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ
Read Also : Unstoppable 2 | రెండు పార్టులుగా బాలకృష్ణ-ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో
Read Also : Waltair Veerayya | వాల్తేరు వీరయ్య నుంచి మెగా మాస్ సాంగ్‌కు టైం ఫిక్స్
Read Also : Neevuntey Chaalu lyrical | మైఖేల్ నుంచి నీవుంటే చాలు లిరికల్ వీడియో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

