IPL 2025| ధనాధన్ టోర్నీ ఐపీఎల్ మార్చి 22 నుండి ప్రారంభం కానుందనే విషయం తెలిసిందే. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్లో ప్రతి జట్టు కూడా టైటిల్ విజేతే కావాలని కసితో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, ప్రతి సంవత్సరం లాగే, ఈ సంవత్సరం కూడా, ఐపీఎల్ నిర్వాహకులు ప్రారంభ వేడుకను నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభోత్సవంలో ఏ ప్రముఖులు ప్రదర్శన ఇస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఐపీఎల్ ఎడిషన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ గ్రాండ్‌గా నిర్వహించే వేడుకకి ఏయే సెలబ్రిటీలు హాజరవుతారనే ఆసక్తి అందరిలో ఉంది. శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ ఓపెనింగ్ సెర్మనీ వేడుకులో డ్యాన్స్ చేయనున్నారట. ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీలో హీట్ పుట్టించే ఈ జంట.. ఐపీఎల్ నైట్‌లో ఉర్రూతలూగించడం ఖాయం అని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇక వీరికి తోడు పాపులర్ సింగర్ అరిజిత్ సింగ్, శ్రేయ ఘోషాల్, పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా తమ పాటలతో యూత్‌ను మైమరపింపజేస్తారని చెబుతున్నారు.
ఇంకొందరు బాలీవుడ్ నటీనటులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ స్టార్ ప్రదర్శనలతో పాటు, అనేక ఇతర కార్యక్రమాలు కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ముంబై, చెన్నై జట్లు అత్యధికంగా చెరో ఐదు సార్లు విజేతలుగా నిలవగా, వాటి తరువాత మూడు సార్లు కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఇక పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ వంటి జట్లుకు ఐపీఎల్ ట్రోఫీ చేతికొచ్చినట్టే వచ్చి చేజారితపోతుంది. ఈ సారైన వారు ట్రోఫీని అందుకుంటారా అనేది చూడాలి