People Media Factory | టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory)ని వరుస ఫ్లాప్‌లు వెంటాడుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఈ బ్యానర్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ కూడా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో వస్తున్న తాజా చిత్రం స్వాగ్(Swag). ఈ సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటిస్తుండగా.. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ సీనియర్ నటి మీరా జాస్మిన్ కీలక పాత్రల్లో నటిస్తుంది. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది స్వాగ్ టీం.
అయితే ఈ ప్రెస్ మీట్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగాడు ఒక రిపోర్టర్. విశ్వప్రసాద్ గారు మీకు వరుసగా డిజాస్టార్‌లు వస్తున్నాయి. ఇది జీర్ణించుకోలేని విషయం. స్వాగ్ సినిమాను చూస్తే.. స్టార్ హీరోలను కాకుంగా కంటెంట్‌ను నమ్ముకుని చేసినట్లు కనిపిస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి అని రిపోర్టర్ అడుగుతాడు. దీనికి సమాధానంగా.. టీజీ విశ్వప్రసాద్ మట్లాడుతూ.. వరుస డిజాస్టార్‌లు అన్నది కొంచెం తప్పు ఈ మధ్య అయితే ఒకటి వచ్చింది. కానీ అంతకుముందు వచ్చిన మనమే చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దానికిముందు వడక్కుపట్టి రామసామి కూడా మంచి విజయాన్ని అందుకుంది. స్వాగ్ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుంది అనుకుంటున్నా. అయితే ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ ఏప్రిల్‌లో వస్తుంది. నాకు ఇప్పటివరకు వచ్చిన లాస్ అంతా రాజా సాబ్ కవర్ చేస్తుంది అది వేరే విషయం అంటూ విశ్వప్రసాద్ చెప్పుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#TheRajaSaab will cover all the losses we have received so far..
– Producer #TGVishwaPrasad pic.twitter.com/OuD7gxt13H
— Suresh PRO (@SureshPRO_) August 29, 2024
ప్రభాస్ కథానాయకుడిగా టాలీవుడ్ డైరెక్టర్ భలే భలే మొగాడివోయ్ ఫేమ్ మారుతి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం రాజా సాబ్ (Raaja Saab). ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read..