Biggboss Season 8 | బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తు వస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది. ఇక సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు సీజన్ 8 బిగ్‌బాస్ రియాల్టీ షో స్టార్ట్ కానుందని ఇది వరకే నిర్వాహకులు అఫిషీయల్‌గా ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
అయితే సీజన్ 8 స్టార్ట్ కాకముందే ఈ హౌస్ లోపలికి ఎవరు ఎవరు వెళుతున్నారు అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా.. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 8లో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చకర్లు కొడుతుంది. అయితే ఫైనల్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ చూసుకుంటే..
నైనికా, బెజవాడ బేబక్క, యశ్వి గౌడ, ఆదిత్య ఓం, నిఖిల్ మెళియక్కాల్, అభయ్ నవీన్, శేఖర్ బాషా, కిరాక్ సీత, సోనియా ఆకుల, విష్ణుప్రియ భీమినేని, ప్రేరణ, దర్శకుడు పరమేశ్వర్, కళ్యాణి మణికంఠ, రవితేజ అనపర్తి, ఖయ్యూమ్ అలీ తదితరులు ఈ షోకి ఫైనల్ కంటెస్టెంట్స్‌గా వెళ్లబోతున్నట్లు సమాచారం. ఈ సీజన్లో మొత్తం 19 మంది పాల్గొంటారని.. ముందుగా 14 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. వీరితోపాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ రీతూ చౌదరి, సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ వర్మ, రాకింగ్ రాకేష్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. కాగా లిస్ట్ నిజమా కాదా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 01 వరకు ఆగాల్సిందే.
#BiggBossTelugu8 – Final Contestants List !
If any Changes I’ll Update…… pic.twitter.com/h5i4q1NHJ9— 𝗕𝗶𝗴𝗴𝗕𝗼𝘀𝘀𝗧𝗲𝗹𝘂𝗴𝘂𝟴™ (@BB8Telugu) August 29, 2024