Godfather | అప్పుడు గబ్బర్ సింగ్..ఇప్పుడు గాడ్ ఫాదర్..!
మరో భాషలో హిట్ అయిన సినిమాలు ఇంకో భాషలో రీమేక్ చేయడం చాలా కష్టం. అందులోనే ఎక్కువగా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే చూసే ప్రతి ఒక్కరు కచ్చితంగా ఒరిజినల్ తో కంపేర్ చేస్తారు.
రీమేక్ సినిమా చేయడం అంటే అనుకున్నంత ఈజీ కాదు. ఒరిజినల్ సినిమా చేయడంలో ఉండే రిస్క్ కంటే.. మరో భాషలో హిట్ అయిన సినిమాలు ఇంకో భాషలో రీమేక్ చేయడం చాలా కష్టం. అందులోనే ఎక్కువగా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే చూసే ప్రతి ఒక్కరు కచ్చితంగా ఒరిజినల్ తో కంపేర్ చేస్తారు. అందుకే రీమేక్ ఎప్పుడు చేసినా కత్తి మీద సామే. ఇదే విషయం రెండు రోజుల కింద చిరంజీవి కూడా ప్రెస్ మీట్ లో చెప్పాడు. రీమేక్ సినిమా చేయడం అంత ఈజీ కాదు.. గాడ్ ఫాదర్ లో కూడా మీరు ఊహించని మార్పులు చేశామని ఆయన చెప్పాడు.
అనుకున్నట్టుగానే సినిమా చూసిన తర్వాత ఆ విషయం అందరికీ అర్థమైంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను.. తెలుగులో గాడ్ ఫాదర్ (Godfather)గా రీమేక్ చేయాలి అనుకున్నప్పుడు.. ఇందులో ఏముంది ఆల్రెడీ తెలుగులో వచ్చిన సినిమాను మళ్ళీ రీమేక్ చేయడం ఏంటి అంటూ చాలా విమర్శలు వచ్చాయి. అయితే దీన్ని కూడా చాలా ప్రెస్టేజియస్ గా తీసుకొని తన ఇమేజ్ కు తగ్గట్టు కథను మార్చుకొని తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాను చేయించుకున్నాడు చిరంజీవి (Chiranjeevi). దీనికోసం సీనియర్ రైటర్స్ చాలామందిని కలిపాడు మెగాస్టార్.
లూసిఫర్ సూపర్ చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు గాడ్ ఫాదర్ చూసి భలే తీశారే అంటున్నారు అంటే దానికోసం సినిమా యూనిట్ ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. సరిగ్గా పదేళ్ల కింద గబ్బర్ సింగ్ (Gabbarsingh) సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. దబాంగ్ సినిమాలోని కేవలం లైన్ మాత్రమే తీసుకొని.. తెలుగు ఆడియన్స్ కు తగ్గట్టు పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని గబ్బర్ సింగ్ సినిమాలో తెరకెక్కించాడు హరీష్ శంకర్.
ఇప్పుడు మోహన్ రాజా కూడా గాడ్ ఫాదర్ విషయంలో ఇదే చేశాడు. చిరు ఇమేజ్ కు తగ్గట్టు కథలో మార్పులు చేసి అభిమానులకు నచ్చేలాగా ఫాదర్ తెరకెక్కించాడు. ఆచార్య తర్వాత బాగా లో పీరియడ్ లో ఉన్న చిరంజీవికి గాడ్ ఫాదర్ ఫలితం కచ్చితంగా ఊరటనిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

