Family Star | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మృణాళ్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురాం (Parasuram) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఇక రన్‌టైం విషయానికి వస్తే.. ఈ మూవీ 150 నిమిషాలు ఉన్నట్లు చిత్రయూనిట్ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. 150 నిమిషాల సంపూర్ణ వినోదాన్ని అందించడానికి ‘ఫ్యామిలీ స్టార్’ రేపు మీ ముందుకు వస్తున్నాడు. అంటూ మేకర్స్ రాసుకోచ్చారు. మరోవైపు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినట్లు ప్రకటించింది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న అతిథి పాత్రలో నటించగా, దివ్యాంశ కౌశిక్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
This summer, it is all about celebrating your FAMILY STAR ⭐️#TheFamilyStar is coming with 150 minutes of WHOLESOME ENTERTAINMENT ✨
Grand release worldwide tomorrow 💥💥
Book your tickets now!
🎟️ https://t.co/GVlkdybqez#TheFamilyStarOnApril5th pic.twitter.com/rLuZHPika0— Shreyas Media (@shreyasgroup) April 4, 2024